ఆ ముగ్గురు హీరోలతో ఇంద్రగంటి మోహన్ కృష్ణ సినిమా ?

చేసినవి  చాల తక్కువ సినిమాలే అయినా, ఇంద్రగంటి మోహనకృష్ణ కు దర్శకునిగా ఓ మంచి ఇమేజ్ ఉంది. అల్లరి నరేష్ తో “బందిపోటు” తీసి బోల్తా పడ్డ ఇంద్రగంటి, ఆ తర్వాత నానితో “జెంటిల్ మెన్”  తీసి సూపర్ హిట్ కొట్టి మళ్ళీ ఫామ్ లో కొచ్చాడు.”జెంటిల్ మెన్”  సక్సెస్ చూసి చాలా మంది  హీరోలు ఉత్సుకత కనబరిచారు. ఈ రేసులో నాగచైతన్య ముందున్నారు.నాగచైతన్య – ఇంద్రగంటి కాంబినేషన్ లో సాయి కొర్రపాటి సినిమా తీయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ లోపు ఏమైందో ఏమో గానీ నాగచైతన్య వేరే ప్రాజెక్టులో కమిట్ అయ్యిపోయాడు. దాంతో ఆ ప్రాజెక్ట్ నుంచి బయటకొచ్చేసాడు.ఎప్పట్నుంచో అతని NRI ఫ్రెండ్స్ ఓ సినిమా చేసిపెట్టమని అడుగుతున్నారు. ఇంద్రగంటి ప్రస్తుతం వాళ్ళకో ప్రాజెక్ట్ చేసే పనిలో ఉన్నారు.కథ కూడా సిద్ధమైంది. ఇందులో ముగ్గురు హీరోలు ఉంటారు. అడివి శేష్, అవసరాల శ్రీనివాస్, వెన్నెల కిశోరె హీరోలుగా ఈ సినిమా అతి త్వరలోనే మొదలు కానుంది.ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది.

SHARE