నెత్తి మీద బాంబు పడింది

ఢిల్లీ: దేశ వ్యాప్తంగా 255 రాజకీయపార్టీలను రద్దు చేస్తూ భారత ఎన్నికల కమిషన్ ఓ ప్రకటన విడుదల చేసింది. 2005 నుంచి 2015 మధ్య కాలంలో ఏ ఎన్నికలోనూ పోటీ చేయకపోవడంతో ఆ పార్టీల గుర్తింపును ఈసీ రద్దు చేసింది. ఈ జాబితాలో తెలుగు రాష్ట్రాల నుంచి 12 పార్టీలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు పెద్ద కుమారుడు నందమూరి హరికృష్ణ స్థాపించిన ‘అన్నా తెలుగుదేశం’ పార్టీతో పాటు లక్ష్మీపార్వతి ఏర్పాటు చేసిన ‘ఎన్టీఆర్ తెలుగు దేశం’ పార్టీ కూడా ఉంది.

ఈసీ రద్దు చేసిన తెలుగు రాష్ట్రాల్లోని 12 పార్టీలు ఇవే..

1. ఆల్ ఇండియా సద్గుణ పార్టీ

2. ఆంధ్రనాడు పార్టీ

3. అన్నా తెలుగు దేశం పార్టీ (హరికృష్ణ)

4. బహుజన రిపబ్లికన్ పార్టీ

5. భారతీయ సేవాదళ్

6. జై తెలంగాణ పార్టీ

7. ముదిరాజ్ రాష్ట్రీయ సమితి

8. నేషనల్ సిటిజన్స్ పార్టీ

9. ఎన్టీఆర్ తెలుగు దేశం పార్టీ (లక్ష్మీపార్వతి)

10. సత్యయుగ్ పార్టీ

11. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ

12. తెలంగాణ ప్రజా పార్టీ.

SHARE