‘హిర‌ణ్య‌క‌శిపుడు’గా నంద‌మూరి బాల‌కృష్ణ‌?

Bala Krishna and Gunasekhar

నందమూరి బాల‌కృష్ణ బాంబులు, తుపాకులు వ‌దిలిపెట్టి, క‌త్తులు ప‌ట్టుకునే చారిత్ర‌త్మ‌క క‌థ‌ల‌పై దృష్టి పెట్టిన‌ట్లు తెలుస్తోంది. త‌న 100వ సినిమా ‘గౌతమీపుత్ర శాత‌క‌ర్ణి’తో బాల‌కృష్ణ సంక్రాంతికి ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాడు. త‌న నెక్ట్స్ మూవీలో ఇలాంటి కొత్త త‌ర‌హా పాత్ర‌ల‌కే ఎక్కువ ప్రాధాన్య‌త ఇవ్వాల‌ని డిసైడ్ అయ్యాడ‌ట బాల‌కృష్ణ‌. అందులో భాగంగానే ‘హిర‌ణ్య‌క‌శిపుడు’ రాక్ష‌స‌ పాత్ర‌ను చేసేందుకు బాల‌కృష్ణ ఓకే చెప్పేశాడ‌ని ఫిల్మ్‌న‌గ‌ర్‌లో స‌మాచారం.

హిర‌ణ్య‌క‌శిపుడు చిత్రాన్ని ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు గుణ‌శేఖ‌ర్ నిర్మించ‌నున్నాడు. డైరెక్ట‌ర్ గుణ‌శేఖ‌ర్ అనుష్క‌తో ‘రుద్ర‌మ‌దేవి’ సినిమా చేసిన విష‌యం తెల‌సిందే. రుద్ర‌మ‌దేవికి సీక్వెల్‌గా ‘ప్ర‌తాప‌రుద్రుడు’ సినిమా చేస్తాన‌ని ప్ర‌చారం చేసుకున్నాడు. ప్ర‌స్తుతం ఆ ప్రాజెక్ట్‌ను ప‌క్క‌న పెట్టేసి, భ‌క్త‌ప్ర‌హ్ల‌ద స్టోరీని ప్రిపేర్ చేసుకున్నాడ‌ట‌. ఇందులో హిర‌ణ్య‌క‌శిపుడు పాత్ర చాలా కీల‌క‌మైన‌ది. గ‌తంలో ఇదే సినిమాను ‘భ‌క్త‌ప్ర‌హ్ల‌ద’ టైటిల్‌తో 1967లో ఏవిఎం సంస్థ నిర్మించింది. ఇందులో హిర‌ణ్య‌క‌శిపుడిగా ఎస్వీరంగారావు, ప్ర‌హ్లాదుడిగా బేబీ రోజార‌మ‌ణి అద్భుతంగా న‌టించారు. ఇప్ప‌టికీ ఆ సినిమా ఎవ‌ర్‌గ్రీన్ హిట్‌. ఇప్పుడ‌దే సినిమాను రీమేక్ చేయాల‌ని గుణ‌శేఖ‌ర్ డిసైడ‌య్యారు. అయితే హిర‌ణ్య‌క‌శిపుడు పాత్ర‌ను నంద‌మూరి బాలయ్య చేస్తే బాగుంటుద‌ని అనుకున్నారు. ఈ ప్రాజెక్ట్ గురించి బాల‌య్య ద‌గ్గ‌ర కూడా ప్రస్థావించారు గుణ‌శేఖ‌ర్‌. బాల‌కృష్ణ సైతం ఇందుకు సానూకూలంగా స్పందిచార‌ని టాక్‌. అయితే ఇది ఎంత‌వ‌ర‌కు నిజ‌మో తెలియ‌లేదు. కానీ గుణ‌శేఖ‌ర్ మాత్రం ‘హిర‌ణ్య‌క‌శిపుడు’ అనే టైటిల్‌ను మాత్రం రిజిస్ట‌ర్ చేయించారు. ఇప్పుడున్న క‌థ‌నాయ‌కుల్లో హిర‌ణ్య‌క‌శిపుడు పాత్ర‌కు న్యాయం చేసే హీరో అంటే బాల‌కృష్ణ‌.. ఆయ‌న గ్రీన్‌సిగ్న‌ల్ ఇవ్వాలేగానీ 2017లో ఈ సినిమా సెట్‌పైకి వెళ్ల‌డం ఖాయం.

SHARE