ఈ ప్ర‌పంచంలో బాగా పాపుల‌ర్ డైలాగ్ ఏంటో తెలుసా.?  ‘బాండ్‌… జేమ్స్‌బాండ్‌’. అన్ని భాష‌ల వారికీ అన్ని ప్రాంతాల‌వారికీ అన్ని ఖండాల‌వారికీ న‌చ్చిన డైలాగ్ ఇది. సినిమా డైలాగుకుండే స్టామినా అటువంటింది. ఒక్క డైలాగువల్లసినిమా ఆడ‌క‌పోవ‌చ్చు. కానీ, క్రేజు వ‌స్తుంది. ఓ ఇంటెన్ష‌న్ తీసుకువ‌స్తుంది. అలాగ‌ని అన్ని డైలాగులు హిట్టు కావు. ఏవో కొన్నే ప్రేక్ష‌కుల మ‌ది కొక్కానికి వేలాడ‌తాయి. ప్ర‌తి డైలాగు పుట్టుక వెనుకా ఓ ప‌ర‌మార్థం ఉంటుంది. ఓ ప్ర‌స‌వవేద‌న ఉంటుంది. అలా బాగా పాపుల‌రైన డైలాగుల వెనుక‌నున్న ఆస‌క్తిక‌ర క‌థ‌క‌థ‌నాల స‌మాహారం.

డైలాగ్ : నాక్కొంచెం తిక్కుందికానీ దానికో లెక్కుంది.

‘గ‌బ్బ‌ర్‌సింగ్’ సినిమా ఎంత హిట్ట‌య్యిందో,  ఈ డైలాగ్ అంత‌క‌న్నా బంప‌ర్ హిట్ట‌య్యింది. పిల్ల‌ల‌కీ, పెద్ద‌ల‌కీ ముఖ్యంగా మాస్‌కి విప‌రీతంగా న‌చ్చేసిన డైలాగ్ ఇది. మామూలుగా ప‌వ‌న్ కల్యాణ్‌కి తిక్క మ‌నిష‌ని ఓ బ్రాండ్ ఇమేజ్ ఉంది.అలాంటాయ‌నే త‌న గురించి తాను చెప్పుకునే స‌రికి ఈ డైలాగ్ రేంజ్ కూడా  ఇంకా పెరిగిపోయింది. ఇంత‌కూ త‌న డైలాగ్ ఎక్క‌డ పుట్టిందో తెలుసా? పొల్లాచ్చిలో. కొంచెం ఆ డీటైల్స్‌లోకి వెళ్దాం..punch-dialogue_seq1

పొల్లాచ్చి.. ప్ర‌కృతి అప్పుడే ప్ర‌స‌వించినంత అందంగా క‌నిపించే ఊరు. గ‌బ్బ‌ర్‌సింగ్ షెడ్యూల్ మొద‌లైంది. కొన్ని సీన్లు, కొన్ని పాట‌లు తీస్తున్నార‌క్క‌డ‌. హైద‌రాబాద్ వెళ్ల‌గానే సినిమా ప్ర‌చారంలో భాగంగా ఓ టీజ‌ర్ రిలీజ్ చేయాలి.ద‌ర్శ‌కుడు హ‌రీష్‌శంక‌ర్ ఆలోచ‌న‌లో ప‌డ్డారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ సినిమా టీజ‌ర్ అంటే అల్లాట‌ప్పాగా ఉండ‌కూడ‌దు. అదిరిపోవాలి. మంచి కిక్కిచ్చే డైలాగు ప‌డాలి. అప్ప‌టివ‌ర‌కూ తీసిన డైలాగులు అంత సంద‌ర్భోచితంగా లేవు. హ‌రీష్శంక‌ర్ మైండ్‌లో ఏదో ఫ్రేమ్ అయ్యింది. చ‌క‌చ‌కా ఆ డైలాగు పేప‌ర్ మీద పెట్టేశారు. ‘నాక్కొంచెం తిక్కుంది.. కానీ దానికో లెక్కుంది’. ఇదీ డైలాగ్‌. ప‌వ‌న్ క‌ల్యాణ్ ఒప్పుకుంటారా? ఒకింత సందేహ‌ప‌డుతూనే ప‌వ‌న్ క‌ల్యాణ్ ఉన్నకేర‌వాన్‌లోకి వెళ్లారు హ‌రీష్‌శంక‌ర్. అప్పుడాయ‌న ఏదో పుస్త‌కం చ‌దువుకుంటున్నారు. హ‌రీష్‌శంక‌ర్ వెళ్లి ఈ డైలాగ్ చెప్ప‌గానే ప‌వ‌న్ క‌ల్యాణ్ చిన్న‌పిల్లాడిలా చ‌ప్ప‌ట్లు కొడుతూ తెగ ఎంజాయ్ చేశారు. నాపై ఎందుకురాయాల‌నిపించిందీ డైలాగ్ అన‌డిగారు ప‌వ‌న్ క‌ల్యాణ్‌. “సార్‌… మీకు బాగా తిక్క అని చాలామందిలో ఓ అప‌ప్ర‌ద ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకునే ఇది రాశా.. దానికి తోడు ‘గ‌బ్బ‌ర్‌సింగ్’ కెరెక్ట‌ర్‌కి ఇది ఫుల్ యాప్ట్” అని జ‌వాబిచ్చారుహ‌రీష్ శంక‌ర్‌. ఇక ఆ టీజ‌ర్ రిలీజ‌య్యాక ఈ డైలాగ్‌కి ఎక్క‌డ లేని క్రేజూ వ‌చ్చింది. ఆ సినిమా ప‌ట్ల ఓ హైప్ తీసుకొచ్చింది ఈ డైలాగే అంటే అతిశ‌యోక్తి కాదు.

రీష్శంకర్ మెంట్

పవ‌న్ క‌ల్యాణ్‌పై ఓ అప‌ప్ర‌ద ఉంది. ఆయ‌న చాలా తిక్క మ‌నిష‌ని, ఎవ్వ‌రి మాటా విన‌ర‌ని అంద‌రూ అనుకుంటారు. నాతో కూడా చాలా మంది అన్నారు. ఆయ‌న‌ను క‌లిశాక అవ‌న్నీ వ‌ట్టి భ్ర‌మ‌లని అర్ధ‌మైంది. మీడియాకు, చాలామందికిదూరంగా ఉంటారు. కాబ‌ట్టి ఆయ‌న‌పై ఈ బ్రాండ్ ప‌డింది. కానీ, ఆయ‌న‌లో ఉన్న సెన్సాఫ్ హ్యూమ‌ర్ ఎవ్వ‌రిలోనూ ఉండ‌దు. ఆయ‌న్నుఉద్దేశించి ఈ డైలాగ్ రాస్తే బాగా ఎంజాయ్ చేశారు.  ఆ ధైర్యంతోనే రెచ్చిపోయి మ‌రీ… “నేను ట్రెండ్ఫాలోకాను. సెట్ చేస్తా”, “నాకెవ్వ‌రూ పోటీకాదు, నాకు నేనే పోటీ” లాంటి డైలాగ్స్ రాశా.

-హ‌రీష్‌శంక‌ర్

(గ‌బ్బ‌ర్‌సింగ్ ద‌ర్శ‌కుడు-ర‌చ‌యిత‌)

డైలాగ్ : పోకిరిలో నేనెంత ఎదనో నాకే తెలియదు.

‘పోకిరి’ త‌ర్వాత మ‌హేష్‌బాబు డైలాగ్ డెలీవ‌రీలో ఓ చేంజ్ క‌న‌బ‌డ‌డం మొద‌లైంది. అస‌లు ‘పోకిరి’లో మ‌హేష్ చెప్పిన డైలాగులు బాగా పేలాయి. ముఖ్యంగా యూత్‌కి బాగా క‌నెక్ట‌య్యాయి. వాటిల్లో ప్ర‌ధాన‌మైన‌ది “నేనెంత ఎద‌వ‌నో నాకేతెలియ‌దు” డైలాగు. నిజంగా మ‌హేష్ లాంటి ఫేమ‌స్ హీరో త‌న గురించి అంతలా నెగిటివ్ డైలాగ్ చెప్పుకోవ‌డ‌మంటే విశేష‌మే. అయితే త‌ర్వాత తర్వాత అలాంటి నెగిటివ్ డైలాగ్స్ ఓ ట్రెండ్ అయ్యి కూర్చున్నాయి. అది వేరే విష‌యం. ఈడైలాగ్ ఎలా పుట్టింద‌ని పూరి జ‌గ‌న్నాథ్‌ని అడిగితే ఆయ‌న రింగు రింగుమ‌ని రీళ్లు తిప్పుతూ త‌న చిన్న‌నాటి ప్లాష్ బ్యాక్‌లోకి వెళ్లిపోయారు.

పూరి జ‌గ‌న్నాథ్ వాళ్ల‌ది న‌ర్సీప‌ట్నం ద‌గ్గ‌ర్లోని ప‌ల్లెటూరు. సినిమాలూ, షికార్లూ చేయాలంటే వైజాగ్ వెళ్లాల్సిందే. అస్త‌మానూ వైజాగంటే నాన్న ఒప్పుకోడు. అందుకే పూరి జ‌గ‌న్నాథ్ ఆర్.ఆర్‌.బి. బి.ఎస్‌.ఆర్‌.బి ఎగ్జామ్స్ ఉన్నాయ‌నిఅబద్దాలు చెప్పేసి వైజాగ్ చెక్కేస్తుండేవారు. అలా వెళ్లిన‌ప్పుడ‌ల్లా వాళ్ల నాన్న ఖర్చుల‌కు స‌రిప‌డా డ‌బ్బులిచ్చేవారు. అద‌నంగా ఇంకో వంద ఇచ్చి, మిగ‌తా ఖ‌ర్చుల గురించి నాక‌న‌వ‌స‌రం. ఈ వంద మాత్రం ఎలా ఖ‌ర్చుపెట్టావో చెప్పుఅనేవార‌ట‌. ఇదే తంతు. ఎలా ఖ‌ర్చుపెట్టాడో తెలియ‌కుండానే పూరి ఖ‌ర్చుపెట్టేసేవాడు. “నువ్వు ఆ వంద ఎలా ఖ‌ర్చుపెట్టావో తెలుసుకుంటే, నువ్వు ఎద‌వ్వా కాదో అని నాక‌ర్థ‌మ‌వుతుంది. త‌ర్వాత నీక‌ర్థ‌మ‌వుతుంది” అనిచెప్పారాయ‌న‌. “నేనెంత ఎద‌వ‌నో నాకు ముందు తెలియాలి క‌దా” అని అనిపించింది. అప్పుడే పూరి మ‌న‌సులో ఈ డైలాగ్ పుట్టింది.

punch-dialogue_seq3

పూరి న్నాథ్ మెంట్

ఎప్పుడో కాలేజ్ ఏజ్‌లో అనుకున్న డైలాగు ‘పోకిరి’ లో క‌రెక్ట్‌గా సూట‌య్యింది. మ‌హేశ్ చెప్ప‌డానికి ఏమైనా ఇబ్బంది ప‌డ‌తాడేమో అనుకున్నా. కానీ త‌నేమీ ప‌ట్టించుకోకుండా చాలా ఎంజాయ్ చేస్తూ చెప్పాడు. ఈ సినిమా మొత్తండైలాగుల పుట్ట‌. ఒక‌దాన్ని మించి ఒక‌టి ఉంటాయి.

-పూరి జ‌గ‌న్నాథ్‌

(‘పోకిరి’ ద‌ర్శ‌కుడు-ర‌చ‌యిత‌)

‘అరుంధతి’ లోని బొమ్మా.. నిన్నొదలా!

సినిమా పేరు చెప్ప‌గానే ఫ‌లానా డైలాగు గుర్చుకొచ్చే సంద‌ర్భాలు చాలా అరుదుగా మాత్ర‌మే ఉంటాయి. అరుంధ‌తి సినిమా పేరు చెప్ప‌గానే ట‌కీమ‌ని ‘బొమ్మాళి.. నిన్నొద‌లా’ డైలాగు గుర్తుకొస్తుంది. త‌న‌ను బ‌తికుండ‌గానే స‌జీవస‌మాధి చేసిన అరుంధ‌తిపై ప‌శుప‌తి ఆగ్ర‌హంతో ర‌గిలిపోతాడు. పైశాచిక‌త్వంతో ఆమెను ర‌క‌ర‌కాలుగా  తూల‌నాడుతూ ఉంటాడు. ఈ నేప‌ధ్యంలో  ఈ డైలాగ్ వ‌స్తుంది. ఈ డైలాగు వ‌ల్ల‌నే ప‌శుప‌తిలోని పైశాచిక‌త్వం, అరుంధ‌తిపై త‌న‌కుఏ రేంజ్‌లో ప‌గ‌, ప్ర‌తీకారాలు ఉన్నాయ‌నేది హైలెవ‌ల్‌లో క‌న‌బ‌డుతుంది. ర‌విశంక‌ర్ గాత్ర‌దానంతో సోనూసూద్ ఈ డైలాగ్ చెబుతుంటే థియేట‌ర్లు దద్ద‌రిల్లిపోతాయి. సాధారణంగా ఇలాంటి భ‌యాన‌క‌మైన డైలాగుని చెప్పిన ర‌విశంక‌ర్‌కి‘బొమ్మాళి’ అని పేరొచ్చేసింది. ఈ డైలాగ్‌ని చాలా మంది చాలా సినిమాల్లో ర‌క‌ర‌కాలుగా వాడుకున్నారు. ఇంత‌కూ ఈ డైలాగ్ రాసింది ఎవ‌రో తెలుసా? చింత‌ప‌ల్లి ర‌మ‌ణ ‘తొలి ప్రేమ’ లాంటి ఎన్నో సూప‌ర్‌హిట్ సినిమాల‌కు ప‌నిచేసినరైట‌రాయ‌న‌. కోడి రామ‌కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో ఎం.శ్యామ్ ప్ర‌సాద్ రెడ్డి నిర్మించారు దీన్ని.

punch-dialogue_seq2

చింతల్లి మెంట్

హీరోయిన్ మీద విల‌న్‌కి ఉండే ప‌గ‌ని చాలా శ‌క్తిమంతంగా, ప్ర‌భావ‌వంతంగా చిన్న‌డైలాగులో ఆవిష్క‌రించాలి. చాలా క‌ష్ట‌మైన ఫీట్ ఇది. “ఓసేయ్ అరుంధ‌తి… న‌న్ను బ‌తికుండ‌గానే స‌మాధి చేస్తావా. నిన్ను వ‌ద‌ల‌నే గుమ్మా”.. అనిమొద‌ట రాశాను. గుమ్మ అంటే పోర్స్‌గా అనిపించ‌లేదు. దాంతో ఆ గుమ్మ‌ని ‘బొమ్మ’ గా మార్చి ‘బొమ్మాయి’ , ‘బొమ్మాజు’ ఇలా ర‌క‌ర‌కాలుగా అనుకున్నా. చివ‌ర‌కు ‘బొమ్మాళి’ అని నా నోట్లోంచి వ‌చ్చింది. ఇదేదో బావుందేఅనిపించింది. శ్యామ్ ప్ర‌సాద్‌రెడ్, డి  కోడి రామ‌కృష్ణ‌కు చెబితే చాలా బావుంద‌న్నారు. స్క్రిప్ట్ ప్రకారం ఏదో ఫోర్స్‌డ్ డైలాగ్ పెట్టాల‌నుకున్నాం గానీ, అది ఇంత  పాపుల‌ర్ అవుతుంద‌ని అస్స‌లు అనుకోలేదు. ‘సుత్తి’ పేరు చెబితేజంధ్యాల‌గారు ఎలా గుర్తుకొస్తారో ‘బొమ్మాళి’ అనేది నాకో సిగ్నేచ‌ర్ అయిపోయింది.

-చింత‌ప‌ల్లి ర‌మ‌ణ‌

(‘అరుంధ‌తి’ సంభాష‌ణ‌ల ర‌చయిత‌)

SHARE