‘వంగ‌వీటి’ రియ‌ల్ స్టోరీ తీస్తా… దమ్ము ఉంటే ఆపండి : జీవీ

movie on Vangaveeti Ranga
రామ్‌గోపాల్ వ‌ర్మ తీసిన వంగ‌వీటి చిత్రం ఇప్పుడు పెద్ద దుమార‌మే లేపుతోంది. విజ‌య‌వాడ‌లో ఏ రోడ్డులో చూసినా వ‌ర్మ దిష్టిబొమ్మ‌లు త‌గ‌ల‌బడుతున్నాయి. వంగ‌వీటి రంగా జీవిత చ‌రిత్ర‌ను కించ‌ప‌ర్చేలా వ‌ర్మ తీశాడంటూ కాపు సామాజిక ప్ర‌జ‌లు నిప్పులు చెరుగుతున్నారు. ఈరోజు వంగ‌వీటి రంగా 28వ వ‌ర్ధంతి కావ‌డంతో ఆ ఆక్రోశం ఇంకా ఎక్కువై పోయింది. విజ‌య‌వాడ రోడ్ల‌మీద ఎక్క‌డ చూసినా ద‌ర్శ‌క నిర్మాత‌ల దిష్టి బొమ్మ‌లు త‌గ‌ల‌బెడుతున్నారు.
ఈ క్ర‌మంలో  జీవీ సుధాక‌ర్ నాయుడు ఓ చాలెంజ్ విసిరాడు. వంగ‌వీటిఒరిజన‌ల్ స్టోరీని తాను తీస్తాన‌ని, ద‌మ్మున్న మొగాడు ఎవ‌డో ఆప‌లాంటూ చాలెంజ్ విసిరాడు. త‌న ఆస్తులు అమ్ముకోనైన ఈ సినిమాను పూర్తి చేస్తాన‌ని ప్ర‌క‌టించాడు. ఇప్ప‌టికే వంగ‌వీటి ఒరిజ‌న‌ల్ స్టోరీని ప్రీపేర్ చేశామ‌ని, త‌న సోద‌రుల స‌హ‌కారంతో త్వ‌ర‌లోనే సెట్‌మీద‌కు తీసుకెళ్తాన‌ని వెల్ల‌డించాడు. త‌న సొంత బ్యాన‌ర్‌లోనే ఈ సినిమా తీస్తాన‌ని జీవీ చాలా ఉద్వేగ‌పూరితంగా చెప్పాడు. దీంతో అక్క‌డున్న కాపు సామాజిక వ‌ర్గ నేత‌లు త‌మ సంతోషాన్ని వ్య‌క్తం చేశారు.
మ‌రోవైపు డ‌బ్బుల‌కు కక్కుర్తి ప‌డి  రంగాలాంటి నాయ‌కుడిని విలన్‌గా చూయించార‌ని వంగ‌వీటి రాధ వ‌ర్మ‌పై మండిప‌డ్డారు. మ‌మ‌ల్ని అడిగితే కాపు ప్ర‌జ‌లంతా చందాలేసుకోని ఇచ్చేవాళ్ల‌న్నారు. బెజ‌వాడ రాజ‌కీయాల గురించి అన్ని తెలుసంటూ చెప్పే వ‌ర్మ త‌గిన మూల్యం చెల్లించుకుంటార‌ని వంగవీటి రాధ‌ హెచ్చరించారు.
SHARE