“త్రిమూర్తులు” గా ఎన్టీఆర్

mikkilineni ntr

“టెంపర్’ , “నాన్నకు ప్రేమతో”, “జనతా గ్యారేజ్”… ఇలా వరుస మూడు హిట్లతో ఎన్టీఆర్ దూకుడు మీద ఉన్నారు.కానీ ఫ్యూచర్ ప్రోజెక్టుల ఎంపికలో మాత్రం నిదానమే ప్రధానం అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. “జనతా గ్యారేజ్” తర్వాత ఎన్టీఆర్ ఎవరితో సినిమా చేయాలనీ లెక్కలేసుకుంటున్నారు.”ఇజం” పెద్దగా వర్కౌట్ కాకపోవడంతో పూరి జగన్నాథ్ ని పక్కన పెట్టేసారు.ఇక రచయిత వక్కంతం వంశీ మంచి కథ చెప్పినా, ఈ టైమ్ లో రిస్క్ ఎందుకని, అతన్ని హోల్డ్ లో పెట్టారు.ఫైనల్ గా బాబీకి ఓటేశారు. పవన్ కళ్యాణ్ తో “సర్దార్ గబ్బర్ సింగ్”  లాంటి డిఆస్టర్స్ చేసిన బాబీని ఎన్టీఆర్ నమ్మడం ఎవర్ని ఆశ్చర్య పరచలేదు. “సర్దార్” ఫెయిల్యూర్ తో బాబీ పాత్ర పెద్దగా లేదని ఇండస్ట్రీలో అందరూ చెబుతారు.దానికి తోడు బాబీ చెప్పిన స్క్రిప్ట్ ఎక్సట్రార్డినరీగా ఉండడంతో వెంటనే ఓకే చెప్పేసాడు ఎన్టీఆర్. ప్రస్తుతం ఆ సినిమాకు సంబంధించి ప్రీ-ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది.ఇందులో ఎన్టీఆర్ త్రిబుల్ ఆక్షన్ చేయబోతున్నాడు. అందుకే “త్రిమూర్తులు” అనే టైటిల్ ఖరారు చేసారు. కాజల్ అగర్వాల్, అనుపమ పరమేశ్వరన్ లు ఇందులో కథానాయికలు.ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై కళ్యాణ్ రామ్ నిర్మించనున్న ఈ సినిమా సంక్రాంతి తర్వాత పట్టాలెక్కనుంది.

SHARE