నందమూరి హ‌రికృష్ణ – క‌ల్యాణ్ రామ్ కాంబినేష‌న్‌లో సినిమా?

nandamuri harikrishna and kalyan ram
Nandamuri Harikrishna and Kalyan Ram

నంద‌మూరి ఫ్యామిలిలో త‌న‌కంటూ ఓ స్పెష‌ల్ ఇమేజ్ తెచ్చుకున్న హీరో క‌ల్యాణ్‌రామ్‌. త‌క్కువ సినిమాలు చేసినా త‌న‌కు నచ్చిన సినిమాలు చేస్తాడు క‌ల్యాణ్‌రామ్‌. ఇటీవ‌లే పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌కత్వంలో ‘ఇజం’ సినిమా చేశాడు. క‌మ‌ర్షియ‌ల్‌గా వ‌ర్క‌వుట్ కాక‌పోయినా, న‌టుడిగా క‌ల్యాణ్‌రామ్‌కి పేరొచ్చింది. నెక్స్ట్ ఆయ‌న జి. నాగేశ్వ‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంతో ఓ సినిమా చేయబోతున్నారు. ఆ త‌ర్వాత క‌ల్యాణ్ రామ్ ఓ సెన్షేష‌న‌ల్ ప్రాజెక్ట్ చేయ‌డానికి సిద్ధ‌మ‌వుతున్నారు. త‌న తండ్రి నంద‌మూరి హ‌రికృష్ణ‌తో క‌లిసి ఓ సినిమా చేయ‌డానికి క‌ల్యాణ్ రామ్ రెడీ అవుతున్నారు. ‘ప్రేమ – ఇష్క్ – కాద‌ల్‌’, ‘సావిత్రి’ సినిమాల‌తో టాలెంటెడ్ యంగ్ డైరెక్ట‌ర్ అనిపించుకున్న ప‌వ‌న్ సాదినేని ఓ డిఫ‌రెంట్ స్టోరీ త‌యారు చేశాడు. ఇందులో హ‌రికృష్ణ – క‌ల్యాణ్‌రామ్ న‌టించే అవ‌కాశాలున్నాయి. నంద‌మూరి హ‌రికృష్ణ చాలాకాలంగా సినిమాల‌కు దూరంగా ఉన్నారు. బాల‌న‌టునిగా ‘తాత‌మ్మ క‌ల’ లాంటి కొన్ని సినిమాల్లో న‌టించిన హ‌రికృష్ణ ‘లాహిరి లాహిరి లాహిరిలో’, ‘సీతయ్య’, ‘టైగ‌ర్ హ‌రిశ్చంద్ర ప్ర‌సాద్’ తదిత‌ర చిత్రాల్లో హీరోగా న‌టించారు. పెద్ద కొడుకు జాన‌కిరామ్ ఆక‌స్మిక మ‌ర‌ణం త‌ర్వాత డిప్రెష‌న్‌లోకి వెళ్లిపోయిన హ‌రికృష్ణ‌ను మ‌ళ్లీ వెండితెర మీదికి తీసుకొచ్చి, కొంచెం ఊర‌ట క‌లిగించాల‌నేది క‌ల్యాణ్‌రామ్ ప్ర‌య‌త్నం. దానికి త‌గ్గ‌ట్టుగా తండ్రీ కొడుకుల కాంబినేష‌న్‌లో మంచి క‌థ దొర‌క‌డంతో దానిని 2017 ద్వితీయార్థంలో తెర‌కెక్కించాల‌ని ప్లాన్ చేస్తున్నారు. పూర్తి వివ‌రాలు త్వ‌ర‌లోనే తెలుస్తాయి.

SHARE