పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ ?

balakrishna
నందమూరి బాలకృష్ణ వందో చిత్రం “గౌతమిపుత్ర శాతకర్ణి” సంక్రాంతి సమరానికి సిధ్దమవుతోంది. ఈలోగా తన నెక్స్ట్ సినిమాలు ఎంపికలో బాలకృష్ణ బిజీగా ఉన్నారు. బాలకృష్ణ తన 101 వ చిత్రంగా కృష్ణ వంశీ దర్శకత్వంలో “రైతు” చేస్తానని ఇప్పటికే ప్రకటించారు. కానీ పరిస్థితులు చూస్తే “రైతు” ట్రాక్ ఎక్కే పరిస్థితులు కనబడడం లేదు. దాంతో బాలకృష్ణ వేరే ఆప్షన్లు వెతుకుతున్నారు. గుణశేఖర్ దర్శకత్వంలో “హిరణ్యకశిపుడు” దాదాపు ఖరారైనట్టే.అయితే వెంటవెంటనే చారిత్రక పౌరాణిక చేయడం కరెక్ట్ కాదనే యోచనలో ఉన్నారట బాలకృష్ణ. అందుకే మంచి మాస్ ఎంటర్ టైనర్ చేసే ఉద్దేశ్యం ఉంది ఆయనకు. ఇందుకు సమర్ధుడైన దర్శకుడు ఎవరా అని జాబితా వేసి చూస్తే పూరి జగన్నాథ్ పేరు ముందు వరుసలో ఉందట.
ఇటీవలే నందమూరి కళ్యాణ్ రామ్ తో “ఇజం” చేసిన పూరి జగన్నాథ్ నెక్స్ట్ ఓ కొత్త్త హీరోతో “రోగ్” అనే సినిమా రెడీ చేసేసారు.ఆ తర్వాత పూరి ఓ చిన్న సినిమాను ప్రయోగాత్మకంగా చేసే ఉద్దేశ్యంలో ఉన్నారట. పవన్ కళ్యాణ్, రవితేజ,ప్రభాస్,నాగార్జున,మహేష్ బాబు,గోపి చంద్,కళ్యాణ్ రామ్ తదితర హీరోలతో సినిమాలు చేసిన పూరి ఇంతవరకు బాలకృష్ణతో సినిమా చేయలేదు. మధ్యలో బాలకృష్ణ – పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో సినిమాకు ప్లాన్ జరిగినా ఎందుకో వర్కౌట్ కాలేదు. బాలకృష్ణ కూడా పూరి దర్శకత్వంలో చేయడానికి ఆసక్తిగా ఉన్నారట. పూరి ఓకే అంటే బాలకృష్ణ తన 101 వ చిత్రాన్ని అతనితోనే చెయ్యడానికి రెడీ. పూరి వివరాలు త్వరలోనే తెలుస్తాయి.
SHARE