ఎంత దుర్మార్గం వర్మా!!

rgv music director
rgv music director
రామ్ గోపాల్ వర్మ అరాచకాలు రోజురోజుకి మితి మీరి పోతున్నాయి.తాను తీసిందే సినిమా .. తాను మాట్లాడిందే వేదం అనే రీతిలో పేట్రేగిపోతున్నాడు. మాఫియా మీద సినిమాలు తీసినా తననెవరూ ఏం చేయలేకపోయారు.. ఫ్యాక్షనిస్ట్ ల మీద సినిమా తీసిన తననేం పీకలేకపోయారనే మొండి ధీమాతో ఉన్నాడు వర్మ. అందుకేనేమో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాడు. వర్మది యూజ్ అండ్ త్రో పాలసీ అని అందరికి తెలుసు.అందర్నీ వాడుకుంటాడు కానీ, ఎవ్వరికి రెమ్యూనరేషన్ ఇవ్వడనే సంగతి ప్రపంచం అందరికి తెలిసిందే. కానీ వర్మ సినిమాలో చేస్తే ఓ గుర్తింపు వస్తుందనే ఒకే ఒక్క కారణంతో ఫ్రీగానైనా అతని సినిమా చేయడానికి ముందుకొస్తున్నారు. దీన్ని బాగా ఆసరాగా తీసుకొని కొత్తగా వచ్చే ఆర్టిస్టుల్ని  టెక్నిషియన్లని తుక్కు తుక్కుగా వాడుకుంటున్నాడు వర్మ. సరే…వాడుకున్నాడు ఓకే, కనీసం క్రెడిట్స్ కూడా ఇవ్వకపోతే ఎలా ! “వంగవీటి” విషయంలో అదే జరిగింది.ఆ సినిమా టైటిల్ సాంగ్ ని రాజశేఖర్ అనే మ్యూజిక్ డైరెక్టర్ తో ట్యూన్ చేయించి పాడించాడు.సింగల్ రూపాయి కూడా అతనికి పారితోషకం ఇవ్వలేదు.
కానీ వర్మ సినిమా కాబట్టి పేరొస్తుందని రాజశేఖర్ ఏమి అడగలేదు.తీరా సినిమా రిలీజయ్యాక చుస్తే టైటిల్ కార్డ్స్ లో రాజశేఖర్ పేరు వేయలేదు.మ్యూజిక్ డైరెక్టర్ అనే కాదు , సింగర్ కూడా లేదు.tv9 లైవ్ లో ఉన్న వర్మని ఈ ఘోరం గురించి రాజశేఖర్ ప్రశ్నిస్తే – అతన్ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టుగా లుక్కిచ్చాడు వర్మ. సరికదా అతని పేరేంటో తెలియదన్నట్లు వ్యవహరించాడు.” నేను వందలాదిమందితో పనిచేస్తుంటాను. పేరు గుర్తుపెట్టుకోవాల్సిన పనిలేదు. అయినా నేను అవకాశం ఇవ్వడమే గొప్ప. ఒక్కసారి టైటిల్స్ లో చాలా మంది పేర్లు మర్చిపోతుంటాము. దానికే ఇంత రాద్దాంతం చేస్తే ఎలా? ఏం చేసుకుంటాడో చేసుకోమనండి.”అనే రీతిలో చాలా దారుణంగా జవాబిచ్చాడు వర్మ. ఇది చాలా తప్పు వర్మా ” ఒక సామాన్య టెక్నిషియన్ ని ఇంతగా అగౌరవపరచడం ఘోరం నేరం.
దేవుడనేవాడు ఒకడున్నాడు ..
సారీ నువ్వు దేవుళ్లను నమ్మవు కదా
దెయ్యమనేది ఒకటి వుంటే, అదే నీకు బుద్ది చెబుతుంది.
రేపు నువ్వు ముంబయి నుండి హైదరాబాద్ రావడానికి ఫ్లైట్ టికెట్ తీసుకుంటావు. కానీ వాళ్ళు నిన్ను మర్చిపోయి వెళ్లిపోయారనుకుందాం.
“ఇదేంటి?” అని నువ్వడిగితే “రోజు వందల మంది పాసెంజర్స్ మా ఫ్లైట్ ఎక్కుతుంటారు. ఒక్కోసారి మర్చిపోతుంటాము . దీనికి ఇంత రాద్దాంతం ఎందుకు? అని వాళ్ళు నీపై తిరగబడితే. నీకు కాలుతుందా లేదా? అయినా చెవిటివాడి ముందు శంఖం ఊదినా, నీలాంటి వాడికి సుద్దులు చెప్పినా ఒక్కటే.
SHARE