సంక్రాంతి బరిలో చిరంజీవి దే పైచేయి ….

సంక్రాంతి బరిలో చిరంజీవి దే పైచేయి ….

జ‌న‌వరి వ‌చ్చిందంటే సంక్రాంతి సంబ‌రాలు మొద‌ల‌వుతాయి. సంక్రాంతితో పాటు సినీ సంబ‌రం కూడా వ‌చ్చేస్తుంది. వెండితెర మీద సినిమా కోళ్లు రెచ్చిపోయి బ‌రిలోకి దిగుతాయి. అయితే ఈసారి సంక్రాంతి బ‌రిలోకి ఓ ఇద్ద‌రు బ‌డా హీరోలు దిగ‌డానికి రెడీ అవుతుండ‌డంతో సినీ ప్రేక్ష‌కుల‌కు సంక్రాంతిని మించిన పండుగ‌లా తోస్తోంది. క్రిష్ ద‌ర్శ‌కత్వంలో బాల‌కృష్ణ త‌న 100వ సినిమా గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణితో రంగంలోకి దిగ‌డానికి సిద్ధంగా ఉన్నాడు. మ‌రోవైపు మెగాస్టార్ చిరంజీవి  9ఏళ్ల త‌ర్వాత ఖైదీనెంబ‌ర్ 150 మూవీతో రీఎంట్రీ ఇస్తున్నాడు. ఈ చిత్రం మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా కావ‌డం గమ‌నార్హం. ఈ రెండు సినిమాలు ఈ ఇద్ద‌రి హీరోల‌కి స్పెష‌ల్ మూవీస్‌. పైగా ఈ రెండు చిత్రాలు సంక్రాంతి బ‌రిలోకి దిగ‌డంతో సినీప్రియుల‌కి మంచి కిక్కు ఇస్తుంది. ఇటు నంద‌మూరి, మెగా అభిమానులు కూడా ఉత్కంఠ‌గా ఎదురుచూస్తున్నారు. ఐతే ఇప్ప‌టి వ‌ర‌కు మెగాస్టార్ చిరంజీవి, న‌ట‌సింహాం నంద‌మూరి బాల‌కృష్ణ చాలా సార్లు సంక్రాంతి స‌మ‌యంలో పోటిప‌డ్డారు. మ‌రి అప్ప‌ట్లో సంక్రాంతి హీరోగా అనిపించుకున్న‌దేవ‌రు.? ఆ ట్రాక్ రికార్డ్ ఎలా ఉందో ఓసారి తిరగేద్దామా …

chattam-tho-poratam

నంద‌మూరి బాల‌కృష్ణ‌, మెగాస్టార్ చిరంజీవి 1985లో సంక్రాంతి బ‌రిలోకిదిగారు. చిరంజీవి చ‌ట్టంతో పోరాటం అనే చిత్రంతో బ‌రిలోకిదిగితే… బాల‌కృష్ణ ఆత్మ‌బ‌లం సినిమాతో వ‌చ్చాడు. ఈ రెండు సినిమాలు 1985 జ‌న‌వ‌రి 11న రిలీజ్ అయ్యాయి. చిరంజీవి హీరోగా వ‌చ్చిన చ‌ట్టంతోపోరాటం 70రోజులు ఆడింది. బాల‌కృష్ణ న‌టించిన ఆత్మ‌బ‌లం సినిమా 50 రోజులు ఆడింది. చ‌ట్టంతోపోరాటం చిత్రం ఫుల్ క‌లెక్ష‌న్ల‌ను వ‌సూలు చేసి సంక్రాంతి పందెం కోడి అనిపించుకుంది.
donga-mogudu-2
ఇక వీరిద్ద‌రు 1987లో సంక్రాంతి స‌మ‌యంలో మ‌రోసారి త‌ల‌ప‌డ్డారు. జ‌న‌వ‌రి 9న రిలీజైన చిరంజీవి దొంగ మొగుడు సినిమా బాక్సాఫీస్‌ను ర‌ఫ్పాడించింది. ఈ మూవీ ఏకంగా 175రోజులు ఆడింది. ఇదే ఏడాది స‌రిగ్గా సంక్రాంతి రోజున అంటే జ‌న‌వ‌రి 14న బాల‌కృష్ణ భార్గ‌వ రాముడు సినిమా థియేట‌ర్లో దిగిపోయింది. కానీ ఈ చిత్రం దొంగ మొగుడు సినిమాను ఢీ కొట్ట‌లేక‌పోయింది. భార్గవ రాముడు చిత్రం 70రోజులు ఆడింది.
inspector-pratap-manchi-donga-3
త‌ర్వాత సంవ‌త్సరం 1988లో కూడా ఈ ఇద్ద‌రు బ‌డా హీరోలు సంక్రాంతి పందెం కోడి అనిపించుకోవ‌డానికి త‌ల‌ప‌డ్డారు. 1988 జ‌న‌వ‌రి 14న చిరంజీవి మంచిదొంగ చిత్రంతో తెర‌పైకి వ‌చ్చాడు. ఒక రోజు త‌ర్వాత అంటే జ‌న‌వ‌రి 15న బాల‌కృష్ణ ఇన్‌స్పెక్ట‌ర్ ప్ర‌తాప్ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. అప్ప‌టికే చిరంజీవి నెంబ‌వ‌న్ స్టార్‌డమ్‌ను మెయిన్‌టైన్ చేస్తున్నాడు.  ఆ క్రేజ్‌తో చిరంజీవి మంచిదొంగ 100డేస్ ఆడింది.
బాల‌కృష్ణ ఇన్‌స్పెక్ట‌ర్ ప్ర‌తాప్ సినిమా 75డేస్‌తో స‌రిపెట్టుకుంది.
hitler-peddannayya-04
1997లో చిరంజీవి, బాల‌కృష్ణ ఇద్ద‌రు నువ్వా-నేనా అన్న‌ట్లు త‌ల‌ప‌డ్డారు. కానీ సినీ ప్రేక్ష‌కులు ఈ ఇద్ద‌రు హీరోల సినిమాల‌ను స‌మానంగా ఆద‌రించారు చిరంజీవి హిట్ల‌ర్, బాల‌కృష్ణ పెద్ద‌న్న‌య్య సెన్సెష‌న‌ల్ హిట్స్ సాధించాయి. 100రోజుల పండుగ‌ను జ‌రుపుకున్న ఈ రెండు చిత్రాలుకూడా సంక్రాంతి బ‌రిలోకి దిగాయి. కాక‌పోతే చిరంజీవి కాస్త ముందుగా జ‌న‌వ‌రి 4న హిట్ల‌ర్ మూవీని ధియేట‌ర్ల‌లో రిలీజ్ చేశాడు. బాల‌కృష్ణ న‌టించిన పెద్ద‌న్న‌య్య చిత్రం సంక్రాంతికి నాలుగు  రోజులు ముందుగా జ‌న‌వ‌రి 11న రిలీజ్ అయింది.
samarasimha-reddy-sneham-kosam-1999-6

మ‌ళ్లీ 1999 సంక్రాంతి బ‌రిలోకి దిగిన బాల‌కృష్ణ సెన్షెన‌ల్ మాస్ హీరో అనిపించుకున్నాడు. ద‌ర్శ‌కుడు బి.గోపాల్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన స‌మ‌ర సింహారెడ్డి చిత్రం బాక్సాఫీస్‌ను కొల్ల‌గొట్టేసింది. ఏకంగా 365రోజులు ఆడింది ఈ మూవీ. స‌మ‌ర‌సింహారెడ్డి చిత్రంతోనే బాల‌కృష్ణ న‌టసింహాం అయిపోయాడు. అదే టైంలో చిరంజీవి విడుద‌ల చేసిన  స్నేహం కోసం మూవీ స‌మ‌ర సింహారెడ్డి ద‌రిదాపులోకి కూడా రాలేదు. కానీ చిరంజీవి డ్యూయల్ రోల్‌గా వ‌చ్చిన స్నేహం కోసం మంచి టాకే తెచ్చుకుంది ఈమూవీ కూడా 100రోజుల పండుగ‌ను సెల‌బ్రెట్ చేసుకుంది. స్నేహం కోసం జ‌న‌వ‌రి 1న ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తే… బాల‌కృష్ణ స‌మ‌ర‌సింహారెడ్డి చిత్రం జ‌న‌వ‌రి 13న థియేట‌ర్లోకి వ‌చ్చింది. ఈ 12రోజుల గ్యాప్‌లో చిరంజీవి స్నేహం కోసం భారీగానే డ‌బ్బులు వ‌సూల చేసింది.

annayya-vamshodharakudu-7

ఆ త‌ర్వాత సంవ‌త్సరం 2000 సంక్రాంతి బ‌రిలో మ‌ళ్లీ త‌ల‌ప‌డ్డారు చిరంజీవి, బాల‌కృష్ణ..  ఈ ఏడాది చిరంజీవి దుమ్ముదులిపేశాడు. అన్న‌య్య సినిమాతో వ‌చ్చి మెగా అభిమానుల‌కు సంక్రాంతి కానుక ఇచ్చాడు. జ‌న‌వ‌రి 4న విడుద‌లైన ఈ మూవీ 175డేస్ ఆడింది. ఇదే టైంలో బాల‌కృష్ణ న‌టించిన వంశోద్దర‌కుడు సినిమా రిలీజైంది. ఈ మూవీ కేవ‌లం 50 రోజుల‌తోనే సరిపెట్టుకుంది.

narasimha-naidu-mrugaraju8
2001 సంక్రాంతికి బాల‌కృష్ణ మ‌రో స‌న్సెష‌న్ హిట్‌ను త‌న ఖాతాలో వేసుకున్నాడు. సంక్రాంతికి రెండు రోజుల ముందు అంటే జ‌న‌వరి 11న‌ విడుద‌లైన న‌ర‌సింహానాయుడు చిత్రం 300 రోజులు ఆడింది. న‌ర‌సింహానాయుడు చిత్రం రిలీజైన రోజే చిరంజీవి మృగ‌రాజు సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకువ‌చ్చాడు. కానీ ఈ మూవీ మెగా అభిమానులను కూడా మెప్పించ‌లేక‌పోయింది. దీంతో ఈ మూవీ జూబ్లి ఫంక్ష‌న్‌తోనే స‌రిపెట్టుకుంది.
anji-lakshmi-narasimha-9
త‌ర్వాత 2002, 2003 సంక్రాంతి స‌మయంలో ఈ ఇద్ద‌రు ఒక్క సినిమా కూడా విడుద‌ల చేయ‌లేదు. రెండేళ్ల గ్యాప్ త‌ర్వాత 2004 సంక్రాంతి బ‌రిలో చిరంజీవి, బాల‌కృష్ణ మ‌ళ్లీ త‌ల‌ప‌డ్డారు. ఈ ఏడాది పందెం కోడిగా బాల‌కృష్ణ ప్రూ చేసుకున్నాడు. జ‌న‌వ‌రి 14న విడుద‌లైన ల‌క్ష్మీన‌ర‌సింహా మూవీ 100 రోజుల పంక్ష‌న్‌ను జ‌రుపుకుంది. ఇదే టైంలో ఒక్క‌రోజు త‌ర్వాత జ‌న‌వ‌రి 15న చిరంజీవి   అంజి సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. కానీ ఈ మూవీ 75రోజులు మాత్ర‌మే థియేట‌ర్లో ఉండ‌గ‌లిగింది.
ఇలా మెగాస్టార్ చిరంజీవి, నంద‌మూరి న‌ట‌సింహా బాల‌కృష్ణ సంక్రాంతి బ‌రిలోకి దిగుతూ నువ్వు – నేనా అన్న‌ట్లు పోటిప‌డ్డారు. ఈ ఇద్ద‌రి ఈ సంక్రాంతి రికార్డుల్లో మెగాస్టార్ చిరంజీవి ముందుజలో ఉన్నారు. నాలుగు సార్లు చిరంజీవి సంక్రాంతి పందెం కోడి అనిపించుకుంటే మూడు సార్లు బాల‌కృష్ణ నెగ్గాడు. కాక‌పోతే బాల‌కృష్ణ రెండు సార్లు 300రోజుల‌ను ట‌చ్ చేయ‌గ‌లిగాడు. కానీ చిరంజీవి ఒక్క‌సారి కూడా సంక్రాంతి టైంలో ఆ ఫీట్‌ను సాధించ‌లేదు.
ఇన్నేళ్ల త‌ర్వాత మ‌రోసారి సంక్రాంతి స‌మ‌రంలో త‌ల‌ప‌డ‌టానికి చిరంజీవి, బాల‌కృష్ణ సిద్ధ‌మ‌వ్వ‌డంతో సినీ ప్రేక్ష‌కులు  ఉత్స‌హం, ఉత్కంఠకు గురౌతున్నారు.  బాల‌కృష్ణ 100వ చిత్రం గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి జ‌న‌వ‌రి 12న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది. ఇటు మెగాస్టార్ చిరంజీవి 150 సినిమా ఖైదీ నెంబ‌ర్ 150 సినిమాను జ‌న‌వరి 11న రిలీజ్ చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు.
SHARE