కన్నడంలో సోగ్గాడిగా ఉపేంద్ర

sena Soggade Chinni Nayana remake

కన్నడంలో తెలుగు సినిమాలని డబ్బింగ్ నేరుగా చేయరు కానీ, రీమేక్ లు మాత్రం బాగానే చేస్తుంటారు.అక్కడ అగ్ర హీరోలతో తెలుగులో బ్లాక్ బస్టరైన సినిమాలను రీమేక్ చేస్తుంటారు.గత సంక్రాంతికి రిలీజై బ్లాక్ బస్టర్ గా నిలిచిన “సోగ్గాడే చిన్నినాయనా” చిత్రాన్ని కన్నడంలో ఉపేంద్ర రీమేక్ చేస్తున్నారు. “ఉపేంద్ర మత్తబాన్” పేరుతో ఈ సినిమా రెడీ అవుతోంది. “ఉపేంద్ర మత్తబాన్” అంటే “ఉపేంద్ర మళ్ళీరా” అని అర్ధం. తెలుగులో నాగార్జున సరసన రమ్యకృష్ణ , లావణ్య త్రిపాఠి నటించారు. కన్నడంలో ఉపేంద్ర సరసన ప్రేమ,ఇంకో కొత్త హీరోయిన్ నటించనున్నారు.నాగార్జున-రమ్యకృష్ణది ఎంత హిట్ పెయిరో కన్నడంలో ఉపేంద్ర-ప్రేమలది అంత హిట్ పెయిర్.ఒక దశలో వాళ్ళిద్దరి మధ్య ప్రేమాయణం బాగా నడిచిందని, పెళ్లి వరకు వెళ్లిందని ఒక టాక్. ఆ తర్వాత ఉపేంద్ర తన సహా నటి ప్రియాంకను పెళ్లి చేసుకున్నారు.ప్రేమ కూడా పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమయ్యారు.ఈ “సోగ్గాడే చిన్నినాయనా” ఫలితంగా ఈ పాత ప్రేమ జంట మళ్ళీ కలవడం కన్నడ అభిమానుల్ని ఆనందానికి గురి చేస్తుంది.

SHARE