క‌మీష‌న్ల‌కు కక్కుర్తి ప‌డుతున్న టాప్ డైరెక్ట‌ర్‌

Top directors commission
Top directors are for commissions

అత‌నో టాప్ డైరెక్ట‌ర్‌. సినిమాలు స్ట‌యిలిష్‌గా తీస్తాడ‌ని పేరు. ఇప్ప‌టివ‌ర‌కు అత‌ను తీసింది అర‌డ‌జ‌ను సినిమాలే. అతని రెమ్యున‌రేష‌న్ కూడా కోట్ల‌లోనే ఉంటుంది. అలాంటివాడికి ఓ చిన్న మైన‌స్ ఉంది. నిజం చెప్పాలంటే దీనిని చిన్న మైన‌స్ అన‌కూడ‌దు. పెద్ద మైన‌స్ అనాలి. లేదా జాఢ్యం అనాలి. గ‌వ‌ర్నమెంట్ ప్ర‌తిదానికి ట్యాక్స్ వేసిన‌ట్లుగా ఇత‌గాడు ప్ర‌తిదానికి క‌మీష‌న్లు కోరుకుంటాడు. సినిమా అంటే 24 శాఖల‌కు సంబంధించిన వ్య‌వ‌హారం. ఒక ప్రాజెక్ట్‌లో వంద‌ల‌మంది డైరెక్ట‌ర్స్ అసోసియేట్ అయిఉండాలి. ఎవ‌రైనా ఇత‌ని సినిమాకు ప‌నిచేయాల‌నుకుంటే క‌మీష‌న్ స‌మ‌ర్పించాల్సిందే. అలాగ‌ని ప్ర‌తి ఒక్క‌రి ద‌గ్గరా డ‌బ్బులు వ‌సూలు చేయ‌డులెండి. డిపార్ట్‌మెంట్ల వారిగా స‌మ‌ర్ప‌ణ‌లు జ‌రుగుతుంటాయ‌న్న‌మాట‌. ఓ సినిమా మొత్తానికి జూనియ‌ర్ ఆర్టిస్టుల బిల్లు కోటి రూపాయలు అయ్యింద‌నుకోండి. ఇత‌నికో ప‌ది ల‌క్ష‌లు అప్ప‌నంగా వెళ్లిపోతుంది. ఇది మూడో కంటికి తెలీయ‌కుండా టాప్ లెవెల్లో జ‌రిగిపోతుంది. ప‌ది ల‌క్ష‌లు అంటే చిన్న ఎమౌంట్ కాదు క‌దా. ఇలా కొన్ని డిపార్ట్‌మెంట్ల నుంచి ఆ టాప్ డైరెక్ట‌ర్‌కి aaమ్యామ్యాలు అందిపోతాయి. అస‌లే ఈ డైరెక్ట‌ర్ తీసేది భారీ బ‌డ్జెట్ సినిమాలు. దానికి తోడు నిర్మాత‌కు ఇదో అద‌న‌పు బ‌డ్జెట్‌. ఒకవేళ నిర్మాత దృష్టికి వచ్చినా స‌క్సెస్‌ఫుల్ డైరెక్ట‌ర్ కాబ‌ట్టి ఏమీ చేయలేని ప‌రిస్థితి. అయినా ఆ టాప్ డైరెక్ట‌ర్‌కి ఇదేం పోయే కాల‌మో! ఇలాంటి కక్కుర్తి మేళాలు మ‌న డైరెక్ట‌ర్స్‌లో కొంత‌మంది ఉన్నారులెండి. వాళ్ల పేర్లు చూస్తే మ‌న‌మే కాదు, టాలీవుడ్డే షాకైపోతుంది.

SHARE