గీతా ఆర్ట్స్ లో ‘గీత’ అంటే ఏంటి ?

గీతా ఆర్ట్స్ లో ‘గీత’ అంటే ఏంటి ?  మీకు తెలుసా?  నాకైతే అల్లు శిరీష్ చెప్పేవరకూ తెలీదు.  గీత అంటే అల్లు అరవింద్ వైఫ్ పేరు గానీ లేదా అమ్మగారి పేరు గానీ అయి ఉంటుందని అనుకుంటాం. కానీ అచ్చుతప్పు.  అచ్చంగా తప్పు. ఎందుకంటే ఈ గీత భగవద్గీత లో ఉన్న గీత అట. దీనికి కారణం కూడా శిరీష్ చెప్పుకొచ్చాడు.  అల్లు అరవింద్ భగవద్గీత నుండి స్ఫూర్తి పొందుతాడట.  అందుకే  కంపెనీ మొదలు పెట్టినప్పుడు ఆ పేరు మీద గీతా ఆర్ట్స్ గా పేరు పెట్టుకున్నాడట.
శిరీష్ ట్విట్టర్ ద్వారా ఈ విషయం తెలియజేస్తూ, అందరూ మా మదర్ పేరు గీత అనుకుంటారు కానీ అమ్మ పేరు నిర్మల అన్నాడు. నిజంగా ఇది అందరినీ ఆశ్చర్యానికి గురి చేసే అంశమే.  అందులో ఏమీ అనుమానం లేదు.  తెలుగు ఫిలిం ఇండస్ట్రీ లో ఒక సక్సెస్ఫుల్ బ్యానర్ గా కొన్ని దశాబ్దాలు గా కొనసాగుతోంది గీతా ఆర్ట్స్ బ్యానర్. తెలుగు లోనే కాకుండా హిందీ, తమిళ భాషలలో కూడా గీతా ఆర్ట్స్ బ్యానర్ భారీ విజయాలు సాధించింది.  అలాంటి బ్యానర్ పేరు వెనక ఇలాంటి స్టోరీ ఉందని మనకసలు తెలియకపోవడం ఆశ్చర్యమే కదా… !
SHARE